ఆడియన్స్ ను ఏం మాయ చేసిందో కానీ ఇప్పుడు యూత్ ఈ వనంతంలో … సమంతా, సమంతా అని కలవరిస్తున్నారు. అందుకు కారణం తన అందచందాలతోనే కాదు నటనతోను సమంత వారిని కట్టి పడేయడమే. సినిమా ఫీల్డ్ కొచ్చి ఏడెనిమిది ఏళ్లే అయినా సమంత తన గ్లామర్ తో, నటనా సామర్థ్యంతో టాప్ పొజిషన్ లో కొచ్చింది. ఈ అమ్మడ్ నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్టయ్యాయి. సామ్ బర్త్ డే సందర్భంగా ఇటు అభిమానులే కాదు సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో తనకి విషెస్ చెప్పిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫుల్ బిజీ అయింది సామ్.తనకు విషెస్ చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పింది సమంతా.
() ‘విశ్వమంత ఉన్న ప్రేమను ఇరుకు ట్విటర్లో చెప్పగలనా’ అని నటుడు వెన్నెల కిషోర్ ట్వీట్ చేశారు.
()‘నీకు తెలుసు.. ప్రజలు ఇంతలా విష్ చేస్తుంటే, నువ్వు బాగుంటావనిహ్యాపీబర్త్డే సమంత’-రామ్.
() ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సమంత. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’-రామ్‌చరణ్
() ‘ప్రశాంత స్వభావం గల సహనటి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు అంతా శుభం కలగాలి రాక్‌స్టార్’-నితిన్
() ‘క్యూట్, సూపర్‌కూల్ సమంతకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే ఇప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా’- హంసానందిని
() ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సామ్..’-హన్సిక
() ‘నిజాయితీ కలిగిన స్వీటెస్ట్ పర్సన్ సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’-రకుల్‌ప్రీత్ సింగ్
() ‘ఈ తరంలో అరుదైన నటి, దయార్థ హృదయురాలు సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు’-హరీష్ శంకర్
()‘కృషి, నైపుణ్యం కలిగిన సహనటి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు’-ధనుష్