చైతూ ఎందుకు న‌చ్చాడంటే..

386
Samantha Ruth Prabhu and Naga Chaitanya love story
Samantha Ruth Prabhu and Naga Chaitanya love story
- Advertisement -

టాలీవుడ్‌లో అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌, సౌత్ ఇండియ‌న్ క్రేజీ హీరోయిన్ స‌మంత ప్రేమాయ‌ణం గురించి గ‌త కొన్ని నెల‌లుగామీడియాలో పుంకాను పుంకాలుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై నాగ‌చైత‌న్య తండ్రి, టాలీవుడ్ అగ్ర‌హీరో నాగార్జునే క్లారిటీ ఇవ్వ‌డంతో వీరి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళ్లింద‌ని అంద‌రికి క్లారిటీ వ‌చ్చేసింది.

Samantha Ruth Prabhu and Naga Chaitanya love story

కొద్ది రోజుల క్రితం నాగ్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ‘సమంతతో ప్రేమలో ఉన్నానని చైతన్య చెప్పాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనేది చెప్పలేదు’ అని నాగార్జున వెల్లడించారు. ఇటీవల చెన్నైలో వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చైతన్య చెప్పిన సంగ‌తి తెలిసిందే. మొన్న నాగ చైతన్య కూడా అగీకరించాడు. ఇప్పుడు సమంత ఓపెన్ అయిపోయింది.

Samantha Ruth Prabhu and Naga Chaitanya love story

‘అవును.. మేము ప్రేమలో వున్నాం. నా మొదటి సినిమా సమయం నుంచే మేం మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. గజిబిగా వున్న నా జీవితాన్ని ఓ దారిలోకి తెచ్చింది చైతన్యే. నావకు లంగరు ఎలాగో నా జీవితానికి చైతన్య అలా. అందుకే అతనితో ప్రేమలో పడిపోయా. పెళ్లి మాత్రం ఈ ఏడాది ఉండదు. తన కెరీర్ ను చైతన్య ప్రోత్సహించే వ్యక్తి అని.. ప్రేక్షకులు ఇక చాలు అనేంతవరకూ సినిమాలు చేసేస్తానని చెప్పింది.

Samantha
మొత్తమ్మీద ఇంతకాలం దోబుచులాడిన వీరి ప్రేమ -పెళ్లి వ్యవహరం ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. మొత్తంమ్మీద అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్ళే లక్కి ఛాన్స్ కొట్టేసిందీ చెన్నయ్ సోయగం.
- Advertisement -