రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైనట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో చిత్రీకరించారు. అయితే ఈ చిత్రం సెట్స్‌లో జాయిన్ అవడానికి రెండు రోజుల క్రితమే వెళ్లిన హీరోయిన్ సమంత ఎండ తాకిడికి వడదెబ్బకి గురయిందట.దీంతో షూటింగ్‌కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
అయితే తన కారణంగా ఆ రోజు షూటింగ్ ఆగిపోకూడదనీ .. తాను చేస్తానని సమంతా చెప్పిందట. అయితే ఆమె మరింత రెస్ట్ తీసుకోవడం అవసరమనీ, తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరిగేది ఆ లొకేషన్ లోనే కనుక అప్పుడు ఆ సీన్ చేసుకోవచ్చని చరణ్ చెప్పాడట. ప్రస్తుతం సమంతా పూర్తిగా కోలుకుందనీ, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు.
మే రెండవ వారం నుంచి తదుపరి షెడ్యూల్ మొదలవనుంది. శరవేగంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాలో చెర్రీ అచ్చం పల్లెటూరి అబ్బాయిగా కనిపించనున్నాడు. త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్‌ని ఖరారు చేయలేదు.దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.