బికినీలో హాట్‌హాట్‌గా… ‘రంగస్ధలం’ రామలక్ష్మీ

298
Samantha poses in bikini on exotic beach Tamil Nadu
- Advertisement -

నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత మ్యాగ్జిమమ్ చాలా పద్ధతిగానే దర్శనమిస్తోంది. సినిమాల విషయంలో తప్ప మాములుగా మాత్రం డ్రస్సు విషయంలో సమంత అక్కినేనివారి కోడలుగా మంచి మార్కులే వేయించుకుంటుంది. అయితే తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఫొటో చూసి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోయింది.

పెళ్లి అయిన వెంటనే నటించడానికి రెడీ అయిపోయిన సమంతకు అవకాశాలు ఏ మత్రం తగ్గలేదు. పెళ్లి తరువాత ఏమాత్రం విరామం తీసుకోకుండా ‘రంగస్థలం’, ‘మహానటి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాస్త తీరికదొరికిందని సమయాన్ని వృధా చేయకుండా ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. సమంత తమిళనాడులోని తెన్‌కాశీలో బికినీ వేసుకుని సేద తీరుతోన్న ఫోటోను పోస్ట్‌ చేశారు. ‘చాలా అలసిపోయాను. ఇది వెకేషన్‌ టైమ్‌. ఇది కావాలని కాదు, అవసరం’ అంటూ పేర్కొంది. ఈ ఫోటో సోషియల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Samantha  poses in bikini on exotic beach Tamil Nadu

ఇక రంగస్ధలంలో సమంత టీజర్ పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. పల్లె పడుచులా సమంత బిందె చంకనబెట్టుకుని గోదావరి వైపు నడుస్తూ కనిపిస్తుంది.పల్లె పిల్లలా ఆమె తన పనులు చేసుకుంటూ ఉండగా, “ఓహోహో ఏం వయ్యారం .. ఏం వయ్యారం .. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలిగానండీ .. ఈ పిల్లను చూస్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసు వచ్చినట్టు ఉంటదండీ. ఈ చిట్టిగాడి గుండెకాయను గోలెట్టించేసింది ఈ పిల్లేనండీ. పేరు రామలక్ష్మి అండీ .. ఊరు ‘రంగస్థలం’ అంటూ చరణ్ వాయిస్ పై ఈ టీజర్ పూర్తయింది.

- Advertisement -