బాలీవుడ్ లోకి ‘ఓ బేబీ’…హీరోగా రానా

135
Samantha O Baby Movie

ఈ మధ్య తెలుగులో విడుదలైన సినిమాలు ఇతర భాషల్లోకి అనువాదం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ముఖ్య పాత్రలో నటించిన ఓ బేబీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుందని సమాచారం. ఈచిత్రంలో రానా ప్రధాన పాత్రలో నటించనున్నాడట. ఇక సమంత పాత్రలో కంగనా రౌనత్ లేదా అలియా భట్ లు నటించనున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శ‌క నిర్మాత‌లు ఈ చిత్రానికి సంబంధించి క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, ల‌క్ష్మీ, తేజ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌లు కీల‌క పాత్ర‌లు పొషించారు. 70 ఏళ్ల వృద్దురాలు తిరిగి య‌వ్వ‌నంలోకి వ‌స్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్న నేప‌థ్యంతో ఈ చిత్రం తెర‌కెక్కింది.

తెలుగులో బంపర్ హిట్ విజయాలు సాధించిన సినిమాలు బాలీవుడ్ లో కూడా విజయం సాధిస్తున్నాయి. తెలుగులో భారీ విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా ఇటివలే బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో విడుదలైంది. అక్కడ కూడా ఈసినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది.