టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైం వచ్చేసింది. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంతల పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. జనవరి 30న నిశ్చితార్థం జరుగగా.. ఆక్టోబర్‌లో ఒక్కటి కాబోతున్నామని రారండోయ్ వేడుక చూద్దాం ప్రమోషన్ల సంధర్బంగా నాగ చైతన్య చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్’ విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చైతు.. అక్టోబరు 6న తమ వివాహం జరగనున్నట్లు చెప్పేశాడు. ‘ఏమాయ చేసావె’ చిత్రం షూటింగ్‌లో చైతు, సమంత స్నేహితులయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.ఇక సమంతతో కలిసి ఎలాంటి సినిమా తీయడానికి ఇష్టపడతారన్న ప్రశ్నకు రొమాంటిక్ సినిమా తీయడానికి ఇష్టపడుతానన్నాడు చైతు. ప్రస్తుతం వీరిద్దరు తమ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. పెళ్లి డేట్ లోపు సినిమాలన్నీ ముగించుకొని పెళ్లి చేసుకోనుంది ఈ యువ జంట..