చై-సామ్ రిసెప్షన్..ముహుర్తం ఖరారు..!

209
Samantha Naga Chaitanya reception date locked
- Advertisement -

గోవాలోని డబ్ల్యూ రిసార్ట్ వేదికగా టాలీవుడ్ ప్రేమజంట చైతూ – సమంత పెళ్లి అంగరంగ వైభవంగా  జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబాలకు చెందిన అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో సమంత మెడలో మూడు ముళ్లు వేశాడు నాగచైతన్య.

ఇక అభిమానులు వీరి రిసెప్షన్ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  నవంబర్ 12న వీరి రిసెప్షన్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.పెళ్లి వేడుకకు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులెవరూ హాజరు కాలేదు. దీంతో అందరి సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు నాగ్ కసరత్తు చేస్తున్నారు.

ఇటీవలే చెన్నైలో చైతు తల్లి లక్ష్మీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరోసారి రిసెప్షన్ జరగనుంది.  చై-సామ్ పెళ్లి హిందు,క్రిస్టియన్ సంప్రదాయా పద్దతుల్లో జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -