నటి సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న మూడో చిత్రం ఇదికావడం విశేషం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో, ఈ చిత్రంపై కూడా భారీ ఆసక్తి నెలకొంది.
కుటుంబ భావోద్వేగాలు, వినోదం మేళవించిన కథతో ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సమంత లుక్ ఆకట్టుకుంటూ, సినిమాకు సంబంధించిన క్యూరియాసిటీని పెంచింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను జనవరి 9న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ విడుదలతో సినిమా కథ, టోన్‌పై స్పష్టత రానుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత కెరీర్‌లో ఈ చిత్రం మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:TTD:రేపటితో వైకుంఠ దర్శనాలు క్లోజ్!

