‘పుష్ప’ ఐటమ్ సాంగ్‌కు సమంత సై..

77
- Advertisement -

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ పోషిస్తుండగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే తొలి భాగంలో ఐటమ్ సాంగ్‌ పెట్టాలిని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ఈ సాంగ్‌లో తళుక్కుమనే అందాలభామ ఎవరో తెలిసింది.

ఈ ఐటమ్ గీతంలో బన్నీ సరసన సమంత కనువిందు చేయనుంది. అంతేకాదు దీనికి సామ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై చిత్రం బృందం అధికారిక ప్రకటన చేసింది. తమ ఆఫర్‌ను సమంత అంగీకరించిందని, ఐటమ్ నెంబర్‌కు ఓకే చెప్పిందని పుష్ప నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ‘పుష్ప’లో ఐదో సాంగ్ చాలా స్పెషల్ అని, అందుకే స్పెషల్ భామ కావాల్సి వచ్చిందని వివరించింది. ఈ సందర్భంగా సమంతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొంది.

- Advertisement -