సమంత…అసహనం!

9
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల శుభం అనే చిత్రంలో ఒక కెమియో రోల్‌లో కనిపించారు. ఈ హారర్ కామెడీ చిత్రాన్ని నిర్మించారు సమంత. ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్‌లో ఉంది.

అయితే తాజాగా జిమ్ వర్కౌట్ పూర్తిచేసుకున్న తర్వాత బయటికి వచ్చేటప్పుడు కెమెరాల ఫ్లాష్‌లతో ఎదురయ్యారు. అయితే ఆమె ఫోన్‌లో గంభీరంగా మాట్లాడుతుండగా, పాపారాజీ ఫొటోలు తీయడం చూసి ఆమె గట్టిగా “స్టాప్ ఇట్ గైజ్” అని హెచ్చరించారు.

ఆ ఫోన్ కాల్‌లో ఆమె మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలియకపోవడంతో, సమంత అసహనానికి కారణమేంటో తెలుసుకోవాలన్న ఉత్కంఠ అభిమానులు మరియు మీడియాలో నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

Also Read:Kavitha:17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకో

- Advertisement -