సమంత ఇన్‌స్టా…సంపాదనెంతో తెలుసా?

149
sam
- Advertisement -

ఓ వైపు సినిమాలు మరోవైపు బిజినెస్‌తో కెరీర్‌లో ముందుకుసాగుతోంది నటి సమంత. ఇప్పటికే ఎడ్యుకేషన్, బొటిక్, రెస్టారెంట్ లతో పాటు మరికొన్ని బిజినెస్‌లు చేస్తున్న సామ్…సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

సినిమాలకి తన రెమ్యునరేషన్ కూడా పెంచేసింది సామ్… ఇటీవల చాలా కమర్షియల్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ గురించి స్టార్స్ తో వారి సోషల్ మీడియాలలో పోస్ట్ చేపిస్తున్నారు. ఇలా పోస్ట్ చేపించినందుకు భారీగానే అమౌంట్ ఇస్తున్నాయి ఆ కంపెనీలు.

సమంత సోషల్ మీడియాలో పెట్టే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన పోస్టులకి భారీగానే డిమాండ్ చేస్తుంది. ఆ సంస్థ రేంజ్ ని బట్టి కూడా డిమాండ్ చేస్తుంది. ఒక్కో కమర్షియల్ పోస్టుకి దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు డిమాండ్‌ చేస్తుంది. అయితే ఇది కేవలం పోస్ట్ వరకే. వీటికి సంబంధించిన ఫొటోషూట్స్‌, వీడియోలు లాంటివి పోస్ట్ చేయాలంటే దానికి డబల్ అమౌంట్ అడుగుతుంది సమంత. ప్రస్తుతం సమంతకి ఇన్‌స్టాగ్రామ్ లో 22.8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

- Advertisement -