బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలైన హారర్ కామెడీ మూవీ స్త్రీ అనూహ్యంగా 100 కోట్ల వసూళ్లు చేసి అక్కడి ట్రేడ్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. స్టార్లు లేకుండా సాహో ఫేమ్ శ్రద్ధ కపూర్ టైటిల్ రోల్లో అంత ఇమేజ్ లేని రాజ్ కుమార్ రావు హీరోగా..అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సీజన్ లోనే సర్ప్రైజ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన విడుదలై 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా నిర్మాతలు రాజ్ నిడిమోరు .. కృష్ణ డీకే తెలుగువారే కావడం విశేషం.
అయితే 15 కోట్లతో నిర్మించిన ‘స్త్రీ’ భారీస్థాయిలో లాభాలను తెచ్చిపెట్టడంతో, తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా కథను సమంతకు .. నిహారికకు వినిపించారట. ‘యూటర్న్’ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో సమంత ఆలోచన చేస్తోందట. ఒకవేళ ఆమె చేయనంటే నిహారికతో చేయాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా సమాచారం.