చేనేత రంగాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్గా తన వంతు కృషిచేస్తోన్న సమంత, ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు.
తెలంగాణలో చేనేత కార్మికుల బతుకు చిత్రాన్ని ప్రతిబింభించేలా దూలం సత్యనారాయణ అనే యంగ్ ఫిలింమేకర్ తెరకెక్కిస్తున్న ఓ డాక్యుమెంటరీలో సమంత కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ టూరిజం ఇండస్ట్రీని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన దూలం సత్యనారాయణ తాజాగా తెలంగాణలో చేనేత రంగం ఎదుర్కుంటున్న సమస్యలపై ఫోకస్ చేస్తూ చేనేత రంగం అభివృద్ధి కోసం తెరకెక్కిస్తున్న డాక్యుమెంటరీలో సమంత ఓ కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం.
డాక్యుమెంటరీ రిలీజైతే కానీ అందులో సమంత పోషించిన పాత్ర ఏంటనే తెలిసే వీలు లేదు. మొత్తానికి చేనేత రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తోన్న శామ్ ని ఫ్యాన్సంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారనే చెప్పాలి.