గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత..

124
samantha-ruth-prabhu

అగ్రకథానాయిక సమంత ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఏ తెలుగు సినిమాకు సంతకం చేయలేదు. దీంతో నాగచైతన్యతో పెళ్లి నేపథ్యంలో ఆమె మెల్లమెల్లగా నటనకు స్వస్తి పలుకుతున్నారని పుకార్లు వచ్చాయి. అయితే గతంలో దీనిపై సమంత స్పందిస్తూ.. మంచి కథలు వస్తే నటిస్తానని, కేవలం ఆ కారణంగానే ఏ సినిమాకు సంతకం చేయడం లేదని చెప్పారు. దీని తర్వాత రెండు తమిళ చిత్రాలకు సంతకం చేసిన సమంత తెలుగులో మాత్రం ఏ ప్రాజెక్టును ఒప్పుకోలేదు. అయితే తాజాగా తెలుగు అభిమానులకు శుభవార్త చెబుతూ.. సమంత ఓ ట్వీట్‌ చేశారు. తాను నటించబోయే ఆసక్తికరమైన ప్రాజెక్టుల గురించి త్వరలో ప్రకటించనున్నానని తెలిపారు. అయితే ఓ అభిమాని ‘తెలుగు? తమిళం?’ అని ప్రశ్నించగా.. ‘తెలుగు’ అని సమాధానం ఇచ్చారు సమంత.

samantha-ruth-prabhu

రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో సమంతను కథానాయికగా అనుకుంటున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌-బాబీ కలయికలో సినిమా వస్తోందని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఇందులో కూడా సమంతను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతుండడం వల్ల తెలుగులో అవకాశాలు రావడం లేదని అందుకే ఇప్పటి వరకు మరో సినిమాకు కమిట్ కాలేదని జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు సమంత కూడా పెళ్లి వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి తనకి ఆఫర్లు తగ్గిపోయాయని, ఇటీవల ఒక ప్రముఖ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతా చెప్పింది.

వరుస హిట్లు ఉన్నప్పటికీ, నాగార్జున కోడలు కదా .. ఎందుకులే .. అని కొంతమంది తనకి ఆఫర్లు ఇవ్వడానికి ఆసక్తిని చూపడం లేదని అంది. పెళ్లి తరువాత సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, నాగార్జున .. చైతూ ఇద్దరూ కూడా తమకి అభ్యంతరం లేదన్నారని చెప్పింది. అయినా దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నారని అంది. సినిమాల సంగతి ఎలా వున్నా .. తనకి మంచి ఫ్యామిలీ దొరికిందనీ, ఆ ఫ్యామిలీతో తన లైఫ్ ఆనందంగా వుంటుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.