యశోద ప్రమోషన్స్‌లో సామ్..!

158
- Advertisement -

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం యశోద. ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సామ్‌..దీర్ఘకాలిక విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

ఇక సినిమా పట్ల తనకు ఉన్న కమిట్‌మెంట్‌ని నిరూపిస్తూ పరోక్షంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనని అనిపించిందని ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడివరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుందని భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. యశోద సినిమాను ఆదరించాలని కోరింది.

మయోసైటిస్ అనే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో.. భరించడం ఎంత కష్టమో తెలిసిందే. కనీసం లేచి నిల్చోవడం, నడవడం కూడా కష్టమే. ఈ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటోన్న సమంత త్వరగా కోలుకోవాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -