మగాళ్లను ప్రశ్నించరా:సామ్ ఎమోషనల్

128
sam
- Advertisement -

విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారి ఇన్‌స్టగ్రామ్ ద్వారా స్పందించిన సమంత ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పోస్టును చేసిన సామ్‌..మహిళ‌ల‌ను ప్ర‌శ్నిస్తూ ఉండే స‌మాజం, మ‌గ‌ళ‌వాళ్ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌దు. అంటే మ‌న‌కు ప్రాథ‌మికంగా నైతిక‌త లేన‌ట్టేనా అని గుడ్ మార్నింగ్ తెలిపింది.

నాగ చైతన్య నుండి విడిపోతున్న‌ట్టు స‌మంత ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి సామ్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెకు ఇతరులతో ఎఫైర్ ఉందని..ఇంకా పలు కారణాలు చెబుతూ కామెంట్స్ చేయగా వాటిపై స్పందించారు సమంత.

పెళ్లి తర్వాత వరుస సినిమాలతో అలరించిన సమంత.. ఇటీవలే ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం.

- Advertisement -