కొండా కామెంట్స్‌పై మళ్లీ స్పందించిన సమంత!

5
- Advertisement -

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన కామెంట్స్‌పై మరోసారి స్పందించారు సమంత. సిటాడెట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… సౌత్ ఇండస్ట్రీ అండగా నిలిచి త‌న‌కు ధైర్యాన్ని ఇచ్చిందని స‌మంత చెప్పింది.

ఇండస్ట్రీ, ప్రజలు చూపించిన ప్రేమే ఈ వివాదం నుంచి బయటకు వచ్చేలా చేసిందన్నారు. లేకుంటే మరింతగా కుంగిపోయేదాన్ని అని చెప్పుకొచ్చారు సమంత. తనపై ఉన్న‌న‌మ్మ‌క‌మే న‌న్ను ఈ స్థాయిలో నిల‌బెట్టింది…. వారు నాలో ఎంతో ధైర్యాన్ని నింపారు అన్నారు.

క‌ష్టాల‌ను ఎదుర్కొన‌డంలో సౌత్ ఇండస్ట్రీ ఇచ్చిన మ‌ద్ద‌తు ఎంతో సాయ‌ప‌డింది. ఒక‌వేళ వారు నా ప‌క్షాన లేక‌పోతే కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చింది. వ‌రుణ్ ధావ‌న్‌, స‌మంత‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సిటాడెట్ హ‌నీ బ‌న్ని న‌వంబ‌ర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read:చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత తొలిగింపు

- Advertisement -