బన్నీ భార్యపై సమంత షాకింగ్ కామెంట్స్‌..

100
- Advertisement -

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌‌‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. తన ఫ్యామిలీకి చెందిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది స్నేహ. తాజాగా ఈ ఐకాన్‌ స్టార్ వైఫ్‌ ఇన్ స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పంచుకుంది.

అందులో స్నేహారెడ్డి స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ శారీలో స్లిమ్‌గా కనిపిస్తోంది. దీనిపై బ్యూటీ సమంత కూడా స్పందించింది. “హాట్” అంటూ ఒక్క పదంతో స్నేహారెడ్డి సౌందర్యాన్ని పొగిడింది. కాగా, స్నేహారెడ్డికి మేకోవర్ చేసింది ప్రముఖ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కాగా, ఆమె ధరించింది మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఈషాన్ గిరి… స్నేహారెడ్డిని క్లిక్ మనిపించాడు.

- Advertisement -