అలా ఉంటే చిరాకు…!

115
Samantha busy with films

సమంత ఏం చేసినా అందులో ఆమె తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుంది. విలక్షణ పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సమంత వ్యక్తిగత జీవితంలోనూ విలక్షణ వ్యక్తిత్వంతో దూసుకుపోతోంది. ఈ బ్యూటీ సేవా రంగంలోనూ ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన సమంత ఈ మధ్యనే తెలంగాణలో చేనేత కార్మికుల్ని కలిశారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు.

మొదటి నుంచి కూడా తనకి ఖాళీగా ఉండటమంటే చాలా చిరాకని సమంతా చెప్పింది. ఎప్పుడూ బిజీగా ఉండటాన్నే తాను ఎక్కువగా ఇష్టపడతానని అంది. అలాంటిది ఈ సారి తనకి కొంత విరామం లభించిందనీ . అయితే ఈ సమయాన్ని కూడా తాను వృథా చేసుకోలేదని చెప్పింది.

తన గురించి తాను లోతుగా ఆలోచించుకోవడానికి ఈ సమయం ఎంతగానో ఉపయోగపడిందని అంది. షూటింగ్స్ బిజీ వలన తాను కోల్పోయిన మానసిక పరమైన ఆనందాన్ని ఈ సమయంలో పొందానని చెప్పింది. మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవల్సిన అవసరం కూడా వుందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ‘రాజుగారి గది 2’ చేస్తోన్న సమంతా, ఆ తరువాత సుకుమార్ – చరణ్ కాంబినేషన్లోని సినిమా కూడా చేయనుంది. ఇక మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో కూడా సమంత నటించనుంది. ఈ సినిమాలో సమంత జమునగా నటించబోతోందట! ఈ పాత్రకు మొదట చాలా మంది పేర్లు పరిశీలించినా, చివరకు సమంత అయితేనే సరిపోతుందని భావించారట! సమంత కూడా ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేసిందట! అక్కినేని కుటుంబంతో సావిత్రికి, జమునకు విడదీయరాని బంధం ఉంది. ఈ సినిమా చేయడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు కోలీవుడ్‌ జనాలు.