Samantha:సినిమాలకు గ్యాప్ ఇచ్చి ధ్యానంలోకి

62
- Advertisement -

ఖుషి తర్వాత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చింది నటి సమంత. తన ఆరోగ్యంపై దృష్టి సారించాలని ట్రీట్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. దీంతో అంతా సమంత ట్రీట్ మెంట్ కోసం ఫారెన్‌కు వెళ్లిందని భావించారు. అయితే ఎవరు ఉహించని విధంగా ధ్యానంలో మునిగిపోయింది సమంత.

కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్లిన సమంత గత రెండు రోజులుగా అక్కడే ఉంటూ నేచర్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో షేర్ చేస్తుంది. తాజాగా ఈషా ఫౌండేషన్ లో ధ్యానం చేస్తున్న పలు ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.

Also Read:Telangana Rains:రెండురోజులు విద్యాసంస్థలకు సెలవు

ఇప్పటివరకు ఎలాంటి ఆలోచనలు రాకుండా, ఎటూ కదలకుండా కూర్చోవడం అసాధ్యమనిపించింది. ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మార్గం అని ఇవాళే అర్థమైంది. ఈ ప్రక్రియ ఇంత సింపుల్ గా, ఇంత పవర్ ఫుల్ గా ఉంటుందని ఊహించలేదు అని చెప్పుకొచ్చింది సామ్.

Also Read:గోపీచంద్… ‘భీమా’ అప్‌డేట్

- Advertisement -