చాలా మంది హీరోయిన్లు వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంటారు. అయితే తన వరకు మాత్రం అలాంటి పరిమితులు లేవంటోంది సమంత. తన నటనకూ వివాహానికి ఏమాత్రం సంబంధంలేదని ఇది వరకే ప్రకటించింది. ఇక శామ్ కి సపోర్ట్‌గా ఆమె పెళ్లి తర్వాత కూడా నటిస్తుందని చైతూ కూడా స్పష్టం చేశాడు.
ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య, సమంతలు.. అక్టోబర్ లో పెళ్లాడబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. వీరి నెక్ట్స్ సినిమా ఒకదాని గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొస్తోంది. వీరి పెళ్ళి తర్వాత నవంబర్ లో ఈ భార్యభర్తలిద్దరూ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారని సమాచారం. దాసరి మారుతి దర్శకత్వంలో ఆ సినిమా రాబోతోందట.
ప్రస్తుతం మారుతి ‘మహానుభావుడు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక పెళ్లి తర్వాత భార్యభర్తలిద్దరూ ఒకే సినిమాలో హీరో,హీరోయిన్లుగా నటించడం అంటే అది ఒకింత అరుదైన విషయమే. మొత్తానికి ఈ కొత్తజంటతో మారుతి దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుందన్నమాట.