సమంత సరికొత్త అవతారం అదిరింది..!

307
samantha
- Advertisement -

నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది సమంత. ఇది వరకే ఆమెకున్న క్రేజ్, ఫాలోయింగ్‌కి అక్కినేని బ్రాండ్ రెక్కలు కట్టేసింది. అపజయమనేదే లేదన్నట్లుగా సమంత జర్నీ సాగుతోంది. కాగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా సమంత ఓ అదిరిపోయే పిక్‌ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో బ్లాక్ కళ్లద్ధాలతో సూపర్ స్టైలీష్‌గా అదరగొడుతోంది. దీంతో నెటిజన్స్ ఆ పిక్‌పై తెగ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఈ లుక్‌ కొంపదీసి అమెజాన్ ప్రైమ్ సిరీస్‌లో సమంత లుక్ ఏమోనని డిస్కస్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ లుక్‌లో సమంత మాత్రం కేక పుట్టిస్తోంది.

ప్రస్తుతం సమంత దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ హీరోగా తమిళ రీమేక్ ’96’లో నటిస్తోంది. ఈ సినిమా ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. సమంత మరోవైపు అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’లో సమంత మరో కీలక పాత్రలో అలరించనుందని టాక్. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ మంచి టాక్‌ను సంపాదించుకుంది. ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ మొదటి సీజన్‌లో అదరగొట్టారు. రెండవ సీజన్ షూటింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ షూటింగ్‌లో సమంత పాల్గొంటోందని తెలుస్తోంది.

- Advertisement -