మా పెళ్లిలో అవి తీయొద్దు…!

194
Samantha about marriage restrictions..!
- Advertisement -

సినీ ప్రముఖుల ఇంట పెళ్లంటే అందరికీ ఆసక్తే. మేం సింపుల్ గా మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పినా చూసే వారికి అది అంగరంగ వైభవమైన వేడుకే.  పెళ్లి ఎలా జరిగింది, ఎవరెవరొచ్చారు, ఎంత ఘనంగా జరిగింది..ఇదే టాపిక్ నడుస్తుంది. ఇప్పుడు నాగచైతన్య, సమంత పెళ్లి విషయంలోనూ అదే జరుగుతోంది.

టాలీవుడ్‌తో పాటు అక్కినేని, రామానాయుడు ఫ్యామిలీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక గోవాలో అంగరంగ వైభవంగా జరగనుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో ఈ  పెళ్లి జరగనుండగా పెళ్లికి వచ్చే అతిథులకు సమంత ఓ సూచన చేసింది.

తమ పెళ్లికి వచ్చే అతిథులెవరూ వారి సెల్‌ఫోన్లలో వీడియోలు తీయొద్దని సమంత రిక్వెస్ట్ చేసిందట.  ఫొటోలు మాత్రం తీసుకోవచ్చని చెప్పిందని సమాచారం. అయితే తమ పెళ్లి ఫొటోలను అందరికీ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసిందట.

తన వ్యక్తిగత వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రావడం సమంతకు ఇష్టం లేదట. అతిథులెవరైనా వీడియోలు తీస్తే.. అవి పొరపాటున యూట్యూబ్‌లోనో, ట్విట్టర్‌లోనో రావడం తనకేమాత్రం ఇష్టంలేదని సమంత అతిథులను కోరిందట.

- Advertisement -