సైకిల్ వార్‌..ఏపీ టు యూపీ

319
Samajwadi
- Advertisement -

సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తండ్రి ములయాం సింగ్ యాదమ్‌, అఖిలేష్‌ మధ్య రణరంగంలా మారింది. సమాజ్ వాది పార్టీ..పార్టీ గుర్తు సైకిల్ తనదని తండ్రి అంటే..ఆ పార్టీపై హక్కు నాకే ఉంది అంటూ కొడుగు పట్టుపడుతున్నారు. దీంతో సమాజ్‌వాది పార్టీలో పోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ నెలకొన్న సంక్షోభం కారణంగా అఖిలేష్ మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. లక్నోలో నిర్వహించిన సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిలేశ్‌ ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వివాదం మరింత ముదిరింది. దీంతో పార్టీపై పట్టు కోల్పోతున్న వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌.. పార్టీ నేత అమర్‌సింగ్‌తో కలిసి ఈరోజు మధ్యాహ్నం దిల్లీలో ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు.

Samajwadi

కుమారుడు అఖిలేశ్‌ యాదవ్ పై జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. పార్టీ రెండుగా చీలిపోయిన నేపథ్యంలో సైకిల్‌ గుర్తును కాపాడుకునేందుకు ములాయం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్తీ చిహ్నాం సైకిల్‌ గుర్తు తనదేనని స్పష్టం చేశారు. దానిపై తనకే పూర్తి హక్కులు ఉంటాయని ములాయం సింగ్‌ స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను ఎవరూ తప్పు పట్టలేరన్నారు. తాను అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. ఇటు అఖిలేశ్‌ కూడా పార్టీపై తనకు పట్టుందంటూ ఆధారాలు సమర్పించేందుకు రెడీ అవుతున్నారు.

Samajwadi
ఈ ఏడాదిలో ఉత్తరప్రదేశ్‌ లో సాధారణ ఎన్నికలు జరుగనుండడంతో..కొంతకాలం నుంచి సమాజ్ వాది పార్టీలో రాజకీయ వేడి రాజకుంది. తండ్రిని కాదని కొడుకు..కొడుగును కాదని తండ్రి పై పార్టీ పై పట్టును పెంచుకునే క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలైయ్యాయి. రెండు రోజుల క్రితం ఇద్దరు వేరు వేరుగా పార్టీ ఎమ్మెల్యేలను ప్రకటించారు. దీంతో ములయాం, అఖిలేష్‌ ను పార్టీ నుంచి బహిష్కరించడం..ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అఖిలేష్ మాత్రం మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. లక్నోలో నిర్వహించిన సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిలేశ్‌ ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సంక్షోభం మరింత ముదిరింది. దీంతో కుమారుడు అఖిలేశ్‌ యాదవ్ పై జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి పయనమయ్యారు.

TDP party

సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ)లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు,1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని టీడిపిలో చోటు చేసుకున్నట్టు కొంది మంది అభిప్రాయపడుతున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ స్థాపకుడు ఎన్టీ రామారావు కు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు పార్టీని..ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే సంఘటనను గుర్తుకు తెస్తున్నాయి

- Advertisement -