డిస్టిబ్యూటర్లను ఆదుకున్న సల్మాన్‌..

183
- Advertisement -

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్ పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. త‌న ఈద్ మూవీ ట్యూబ్‌లైట్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌టంతో న‌ష్టాల్లో కూరుకుపోయిన డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చాడు. ఈ మూవీ ఫ్లాప‌వ‌డంతో సుమారు రూ.70 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచ‌నా. అందులో సగం అంటే రూ.35 కోట్లు ఇవ్వ‌డానికి సల్మాన్ సిద్ధ‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని ట్రేడ్ అన‌లిస్ట్ కోమ‌ల్ నాతా వెల్ల‌డించాడు.

ప్రేక్షకులను ఆకర్షించలేక, కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో వారికి నష్టపరిహారం కింద కొంత మొత్తాన్ని చెల్లిస్తానని సల్మాన్ ఖాన్ ఇటీవలే హామీ ఇచ్చాడు. జూన్ 23న విడుదలైన ‘ట్యూబ్ లైట్’ ఓపెనింగ్స్ రూ.21.15 కోట్లతో మొదలైంది. మొదటి వారాంతంలో ఈ చిత్రం రూ.64.77 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.

Salman Khan to return Rs. 35 crore to distributors

అయితే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందని ఆశించిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు నిరాశ ఎదురైంది. దీంతో, తాము నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ వారికి నష్టపరిహారం చెల్లిస్తానని ఇచ్చిన హామీ ఇవ్వగా ఆ మాటను నిలబెట్టుకోనున్నాడు. ఆ నష్టపరిహారాన్ని జులై నెలాఖరుకే సల్మాన్ అందజేయాల్సి ఉంది కానీ, 2017 ఐఐఎఫ్ఏ అవార్డ్స్ కార్యక్రమంలో ఇన్నిరోజులు బిజీగా గడపడంతో వీలుపడలేదట.

- Advertisement -