సల్మాన్ ఖాన్ సహజంగానే చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. లోపల ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం సల్మాన్ కి చేతకాదు. ఏ అంశం పైన అయినా సరే తనకు ఏది అనిపిస్తే అదే చెబుతాడు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ కంటెంట్ పై సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓటీటీలతో సహా అన్ని మాధ్యమాలకు సెన్సార్ ఉండాల్సిందేనని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘15-16 ఏళ్ల పిల్లలు ఫోన్‌లో ఓటీటీ కంటెంట్‌ను చూస్తున్నారు. అందుకే వాటిలో అసభ్యత, అశ్లీలత, దూషణలు ఆగిపోవాలి. మీ కుమార్తె చదువుకోకుండా ఇలాంటి కంటెంట్‌ను చూస్తుంటే మీకు మంచిగా అనిపిస్తుందా ?, మనం ఇండియాలో నివసిస్తున్నాం. కాబట్టి హద్దులను మీరకూడదు’ అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఇలా ఓటీటీలతో సహా అన్ని మాధ్యమాలకు సెన్సార్ ఉండాల్సిందేనని చెప్పడం నిజంగా విశేషమే. అలాగే సల్మాన్ నేటి స్టార్ యంగ్ హీరోల పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ జనరేషన్ హీరోలు బాగానే నటిస్తున్నారు. కానీ, వారిని ఆశ్చర్యం వేస్తోంది. అదృష్టం బాగుండి, ఒకటి, రెండు మూవీలు హిట్ అయితే చాలు, వెంటనే వాళ్ళు తమ రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారని సల్మాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తనతో పాటు షారుఖ్, అమీర్, అక్షయ్, అజయ్ వంటి వారు రెమ్యూనరేషన్ కన్నా సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని సల్మాన్ చెప్పుకొచ్చాడు. వావ్ పైత్యపు హీరోగారు నీతులు చెబుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిసీ కా భాయ్.. కిసీ కి జాన్’ అనే పాన్ ఇండియా సినిమా వస్తోంది. ఈ సినిమాలో తెలుగు హీరో వెంకటేష్ కూడా ప్రధాన పాత్రలో నటించడం విశేషం. తెలుగులో కూడా ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఏంటమ్మా’ సాంగ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ‘ఏంటమ్మా’ సాంగ్ లో ఓ అతిథి పాత్రలో రామ్ చరణ్ తళుక్కున్న మెరిసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పటికే 43 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించింది.
ఇవి కూడా చదవండి..