బాడీగార్డును కొట్టిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌..!

289
Salman Khan
- Advertisement -

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తన బాడీగార్డు చెంప పగలగొట్టాడు. ఇది సినిమాలో అనుకుంటే పోరపాటే.. తన ఫ్యాన్‌ అయిన ఓ బాలుడితో దురుసుగా ప్రవర్తించడంతో సల్మాన్‌కి కోపం వచ్చింది. అందరూ చూస్తుండగానే ఆ బాడీగార్డుని కొట్టాడు. ఈ సంఘటన తాజాగా ముంబయిలో ‘భారత్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ సల్మాన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు. షో పూర్తవగానే బయటికి వచ్చిన సల్మాన్‌ అందరికీ అభివాదం చేసుకుంటూ కారు ఎక్కబోయారు.

ఈ క్రమంలో ఆయన బాడీగార్డు సల్మాన్‌ను దారి ఏర్పరిచే క్రమంలో ఓ బాలుడ్ని పక్కకు నెట్టారు. కనీసం అతడ్ని పైకి కూడా లేపలేదు. దీంతో ఆగ్రహించిన సల్లూభాయ్‌ అతడి చెంపచెళ్లుమనిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఇది ఫ్యాన్స్‌పై సల్మాన్‌కు ఉన్న ప్రేమ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -