దాదాపు 20 ఏళ్ల తర్వాత రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు శిక్ష పడిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విచారణ అనంతరం సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ఈ కేసులో మిగితావారిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసు నేపథ్యంలో 2009లో ఓ ఛానల్‌తో సల్మాన్ చెప్పిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హమ్ సాత్ సాథ్ హై సినిమా షూటింగ్ ముగించుకొని ఆ రోజు తాను, తన సహనటులు త్వరగా బయలుదేరామని, తాము వెళ్తుండగా కృష్ణజింకల గుంపు ఎదురుపడిందని, అందులోని ఒక దానికి తాము బిస్కెట్లు తినిపించామని ఆయన చెప్పారు. ఈ చిన్న ఘటననే పెద్దది చేసి ఇంతదాక తీసుకొచ్చారని సల్మాన్ చెప్పారు.
1998లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ తో పాటు సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌లపై కేసు నమోదైంది. ఈ కేసులో 1998 అక్టోబర్‌లో అరెస్టైన సల్మాన్ ఆ తర్వాత ఐదు రోజులకు బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా న్యాయస్థానం 5 సంవత్సరాల జైలు శిక్ష విధించడంలో సల్మాన్ చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం సల్మాన్ కమిట్ అయిన సినిమాల పరిస్ధితి ఏంటో తెలియని అయోమయం నెలకొంది.