బాహుబలి బడ్జెట్‌ ను మించనున్న సల్మాన్ ఖాన్ సినిమా..

224
- Advertisement -

ఒకవైపు నటిస్తూనే.. ‘సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు సల్మాన్‌. ప్రతిభ ఉన్న వారికి ఈ నిర్మాణ సంస్థ ద్వారా చేయూతనిస్తూ.. చిన్న బడ్జెట్‌ సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు కబీర్‌ఖాన్‌ తెరకెక్కిస్తున్న ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రంలో నటిస్తున్న సల్మాన్‌.. నిర్మాతగా భారీ బడ్జెట్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. మరో నిర్మాతతో కలిసి రూ.300కోట్ల బడ్జెట్‌తో 102ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను సినిమాగా నిర్మిస్తున్నారట సల్లూభాయ్‌.

salman khan
1914లో 349 సిక్కు ప్రయాణికులతో జపాన్‌కి చెందిన కామగట మరు అనే ఓడ కెనడాకి చేరుకుంది. అయితే అక్కడి అధికారులు సిక్కులను ఆ దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదు. దీంతో గుర్దిత్‌ సింగ్‌ అనే లాయర్‌ సిక్కు ప్రయాణికులకు అండగా నిలిచాడు. కెనడాలోకి ప్రవేశించే హక్కు కోసం వారి తరఫున పోరాడాడు. ఆ పోరాటాన్నే నిర్మాత అజయ్‌ వీర్మాణి సినిమాగా మలచాలని భావించారట. ఆ విషయాన్ని సల్మాన్‌కి చెప్పగా వెంటనే సహాకారం అందించేందుకు ఒప్పుకున్నారట. సిక్కు లాయర్‌గా విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ను ఎంపిక చేశారట. సల్మాన్‌.. అజయ్‌ వీర్మాణి సంయుక్తంగా రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

salman khan

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల జాతి వివక్ష కొనసాగుతోందని.. అలాంటి పరిస్థితులకు ఈ సినిమా అద్దం పడుతుందని అజయ్‌ వీర్మాణి అంటున్నారు. సల్లు భాయ్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించి సూరజ్ పంచోలి..అదిత్య శెట్టి వంటి న్యూ కమర్స్‌ను బాలీవుడ్ తెరకు పరచయం చేశాడు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వచ్చే ఏడాది వెల్లడిస్తారట.

- Advertisement -