- Advertisement -
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో ఆయుధ లైసెన్సు మంజూరీ అయ్యింది. ఆత్మరక్షణ నిమిత్తం సల్మాన్‌కు లైసెన్సు మంజూరీ చేశారు. గన్ లైసెన్సు కావాలంటూ గత నెలలో ముంబై పోలీసు కమీషనర్ వివేక్ ఫన్‌సల్కర్‌ను సల్మాన్ కలిసిన విషయం తెలిసిందే. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం సల్మాన్ పోలీసు ఆఫీసుకు వెళ్లారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హీరో సల్మాన్‌ను బెదిరించారు. 1998లో జరిగిన కృష్ణ జింక కేసుతో ఈ బెదిరింపులకు లింక్ ఉంది.
పంజాబ్ సింగర్ సిద్ధూ హత్య జరిగిన కొన్ని రోజుల తేడాలోనే నటుడు సల్మాన్‌తో పాటు ఆయన తండ్రికి బెదిరింపులు రాగా విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థ ఆయుధ లైసెన్స్ మంజూరు చేసింది.
- Advertisement -