బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడు ఎదో ఒక వివాదంలో ఇరుక్కుంటాడు. మొన్నటి వరకూ జింకను చంపేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సల్మాన్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. సల్మాన్ ప్రస్తుతం భరత్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సినిమాలోని ఓ సిన్ లో ఆయన భారత్ లో పాకిస్ధాన్ జెండాను ఎగురవేశారు. సినిమా షూటింగ్ లో భాగంగానే ఇది జరిగినప్పటికీ, అక్కడి స్థానికులు, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.
వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ను భారత్ , పాకిస్ధాన్ బార్డర్ లో చేయాల్సి ఉండగా అక్కడ నెలకొన్న పరిస్ధితుల కారణంగా చిత్రికరణకు అనుమతి లేకపోవడంతో పంజాబ్ లో ఓ ప్రత్యేకమైన సెట్టింగ్ వేసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని సన్నివేశంలో భాగంగా సల్మాన్ పాకిస్ధాన్ జెండా ఎగురవేయాలి..దీంతో ఈసీన్ తీస్తుండగా స్ధానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్ధానికులు సల్మాన్ పై పెట్టిన కేసు పై స్పందించారు చిత్రయూనిట్. షూటింగ్ లో భాగంగానే పాకిస్ధాన్ జెండాను ఎగురవేశామని స్పష్టం చేశారు.