సల్మాన్ సినిమాలో రామ్ చరణ్

14
- Advertisement -

“RRR” సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రపంచ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అకాడమీ అవార్డుల వేడుక కోసం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నాడు. యునైటెడ్ స్టేట్స్‌లో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను కలుస్తూ సందడి చేస్తున్నాడు.

తాజాగా బాలీవుడ్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఇందులో సల్మాన్ ఖాన్ తో కలిసి కాలు షేక్ చేయడానికి అంగీకరించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ మేరకు ఇందులో వెంకటేష్ కూడా నటించాడు. అన్నయ్య పాత్రల్లో వెంకీ నటించాడు. అయితే ఇందులో ఓ సాంగ్ లో చరణ్ స్పెషల్ అప్పయరెన్స్ ఇవ్వనున్నాడు.

సల్మాన్‌ఖాన్‌, రామ్‌చరణ్‌ కుటుంబాల మధ్య ప్రత్యేక బంధం ఉంది. గత ఏడాది చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్‌ఖాన్‌ అతిధి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం రామ్ చరణ్ వంతు. మరి సల్మాన్ ఖాన్ , రామ్ చరణ్ కలిసి డాన్స్ చేస్తే ఇరువురి ఫ్యాన్స్ కి పండగే.

ఇవి కూడా చదవండి…

బిడ్డ పుట్టిన వెంటనే ఎందుకు రీఎంట్రీ అంటే !

విమర్శలు చేసి వెనక్కితీసుకోకపోతే ఎలా?

ఆర్య…సర్పట్ట రెండవ పార్టు

- Advertisement -