పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. విడుదలైన రోజునుంచే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుండడంతో మూవీ మేకర్స్.. ఈ సినిమాను స్పానిష్ భాషలో రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విదేశీ భాషలో కూడా సలార్ విడుదల కాబోతుంది. మరోపక్క బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘సలార్’ దెబ్బకు, ఇప్పుడు సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో సలార్-2 విడుదలపై ఈ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ బిగ్ అప్ డేట్ అందించారు. 15 నెలల్లో పార్ట్-2ని పూర్తి చేసి.. 2025లో రిలీజ్ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ఉండనుందని ఆయన తెలిపారు. అన్నట్టు సలార్ పార్ట్ 1 మూవీ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ మూవీ నైజాం(తెలంగాణ)లో భారీ కలెక్షన్లు సాధిస్తుంది. నైజాంలో ఈ మూవీ ఇప్పటివరకు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ నైజంలో ఈ ఫీట్ సాధించాయి.
కాగా, ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రెండు వారాల్లో రూ.659.69 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఐతే, ఎప్పుడు లేనిది ప్రభాస్ సినిమాకు నైజాంలో రికార్డు కలెక్షన్స్ రావడం విశేషం. ఇక . ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో అయితే స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. మరి ఈ చిత్రం ఓటీటీలో ఏ రేంజ్ మిలియన్ల వ్యూస్ ను రాబడుతుందో చూడాలి.
Also Read:KTR:సంక్షేమ పథకాల రద్దుకు కుట్ర