Salaar:ప్రభాసూ.. నిడివి కాస్త ఆలోచించు

11
- Advertisement -

ఇది మారుతున్న కాలం, అత్యధిక ప్రేక్షకులు అభిరుచులకు అనుగుణంగా సినిమా నిడివి కూడా మారిపోయిన కాలం. అప్పట్లో మూడు గంటల నిడివి ఉన్న సినిమాలు ఎక్కువ వచ్చేవి. కానీ, ప్రస్తుతం టీట్వంటీ ట్రెండ్ నడుస్తోన్న జనరేషన్ కాబట్టి, రెండు గంటలకు కాస్త ఎక్కువ నిడివి ఉన్న సినిమాలే పెత్తనం చెల్లాయిస్తున్నాయి. పైగా నిడివి తక్కువ ఉన్న సినిమాలకే ఆదరణ ఎక్కువ ఉండటం విశేషం. అన్నిటికీ మించి ఇలాంటి సినిమాలకి వెళ్ళే ప్రేక్షకులు మూడ్ కూడా చాలా మారిపోయింది. మరి అలాంటి ఆడియన్స్ ను మూడు గంటలు కూర్చో పెడితే ఎలా ?, ఏమవుతుంది ?, మొన్నే యానిమల్ హిట్ అయింది కదా ? అని సమాధానం చెబుతున్నారు సలార్ టీమ్.

ప్ర‌భాస్, శృతి హాస‌న్ జంట‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స‌లార్. డిసెంబ‌ర్ 22న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైల‌ర్ రీసెంట్‌గా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా, స‌లార్ సినిమా ర‌న్ టైమ్ గురించి నెట్టింట ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. స‌లార్ సినిమా 2 గంట‌ల 55 నిమిషాల ర‌న్ టైమ్‌తో రిలీజ్ కానుంది. నిజంగా ఇది షాకింగ్ న్యూసే. ఒకప్పుడు సినిమా అంటే ఒక పూట మొత్తం కేటాయించేవాళ్ళు. రన్ టైం తో సంబంధం లేకుండా తీరిగ్గా చూసేవాళ్ళు. కానీ, ఇప్పుడు అంత తీరిక ప్రేక్షకులకు ఉందా ?, టైంని ప్లాన్ చేసుకొని థియేటర్ రావడం అనేది ఇప్పుడు అసాధ్యమే.

ముఖ్యంగా సెలవు రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో సినిమాకి వెళ్ళే ఆడియన్స్.. రన్ టైంని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారనే విషయాన్ని ప్రశాంత్ నీల్ ఎందుకు గమనించడం లేదో. పోనీ, ప్రభాస్ అయినా లీడ్ తీసుకుని, సలార్ సినిమా నిడివిని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కదా ?. అసలు రెండు గంటలకు మించిన సినిమా వుంటేనే బోర్ అంటున్నారు. ఇక దగ్గర దగ్గరగా మూడు గంటలు పాటు సినిమా నిడివి ఉంటే ఇంకేం అంటారో !!.సినిమా బావుంటే జనాలు నాలుగు గంటలు కూడా చూస్తారు’ అనేది అబద్ధం. యానిమల్ అద్భుతమైన హిట్ అయినా, నిడివి సినిమాకి మైనస్ అయింది అనేది పచ్చి నిజం. ప్రభాసూ.. నిడివి గురించి కాస్త ఆలోచించు.

Also Read:‘పుదీనా’తో ఉపయోగాలు తెలుసా..

- Advertisement -