నేషనల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే హీరో మరియు డైరెక్టర్ ఇద్దరికి కూడా నేషనల్ వైడ్ గా మంచి పాపులారిటీ ఉండడంతో ఈ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ దగ్గరనుంచే విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఇక ఆ మద్య రిలీజ్ అయిన టీజర్ ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఏ హీరోకు సాధ్యం కానీ రీతిలో టీజర్ విడుదలైన తక్కువ టైమ్ లోనే వంద మిలియన్ల వ్యూస్ రాబట్టి ఆ సినిమాపై ఉన్న క్రేజ్ ను చెప్పకనే చెప్పింది. దాంతో మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. .
ఇంతలోనే అనివార్య కారణాల వల్ల మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా సినీ ఆడియన్స్ తీవ్ర డిస్సపాయింట్ అయ్యారు. మామూలుగా ఈ మూవీని ఈ నెల 28 న విడుదల చేయాల్సి ఉంది. కానీ సినిమా వాయిదా పడడంతో కనీసం ట్రైలర్ అయిన రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో అభిమానులు తెగ గోల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేసీందుకు చిత్రయూనిట్ డేట్ ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే కావడంతో ఆ రోజు ట్రైలర్ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. అదే రోజునే రిలీజ్ డేట్ పై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీని నవంబర్ లో దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందట. మరి దేశ వ్యాప్తంగా భారీ హైప్ ఉన్న సలార్ టీజర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.
Also Read:చంద్రబాబుపై మరో కేసు.. బిగుస్తున్న ఉచ్చు?