రీ రిలీజ్‌లోనూ ‘సలార్’ అదుర్స్!

2
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించగా తాజాగా ఈ చిత్రం రీరిలీజ్‌లోనూ అదిరే ఓపెనింగ్స్‌ను రాబట్టింది. సలార్ రీరిలీజ్ లో మొదటి 3.24 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో సలార్ మళ్ళీ అదరగొట్టింది అని చెప్పవచ్చు.

రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ పాన్ ఇండియా వైడ్‌గా సినిమాను తెరకెక్కించారు. వారు నిర్మాణం వహించారు. అలాగే మేకర్స్ సలార్ పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సలార్‌ దెబ్బకు, ఇప్పుడు సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ 2లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సలార్ పార్ట్ 2 కు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఖరారు చేయగా 2025లో ప్రేక్షకుల ముందుకురాబోతుంది.

Also Read:కన్నప్ప.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్

- Advertisement -