Salaar:వామ్మో.. సలార్ రీమేక్ మూవీనా?

40
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ మరియు పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” సలార్ “. ఈ మూవీ విడుదల కోసం ఇండియన్ సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 న విడుదల అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఇక్కడ చూసిన సలార్ కు సంబంధించిన చర్చే జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో సలార్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. డిసెంబర్ 1 న విడుదల అయిన సలార్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. కాగా సలార్ ట్రైలర్ తో కొన్ని సందేహాలు ఫ్యాన్స్ ను గట్టిగానే వెంటాడుతున్నాయి. సలార్ సినిమా కన్నడ ” ఉగ్రం ” మూవీకి రిమేకా అనే ఫ్యాన్స్ లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. .

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మొదటి మూవీ ‘ఉగ్రం’ ఇద్దరు స్నేహితుల కథాంశంతో వచ్చిన ఈ మూవీ కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే అదే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీ కూడా ఫ్రెండ్షిప్ నేపథ్యంలోనే తెరకెక్కుతుండడంతో సలార్ మూవీ ఉగ్రం కు రీమేక్ అనే వార్తలకు మరింత బలం చేరుకుర్తోంది. అయితే మొదటి నుంచి కూడా సలార్ మూవీపై ఈ రకమైన గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సలార్ రీమేక్ అనే విషయాన్ని అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ గాని, హీరో ప్రభాస్ గాని ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. కాగా ఉగ్రం మూవీ సింగిల్ మూవీగానే రూపొందగా సలార్ రెండు భాగాలుగా రాబోతుంది. దాంతో రెండు మూవీస్ వేర్వేరుగా ఉండే అవకాశం లేకపోలేదు. మరి సలార్ మూవీ ఉగ్రం ,కు రిమేకా లేదా స్ట్రైట్ మూవీనా అనేది తెలియాలంటే డిసెంబర్ 22 వరకు ఎదురు చూడక తప్పదు.

Also Read:సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా

- Advertisement -