కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్‌ల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో యువతలో అవేర్‌నెస్ తీసుకువస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ . ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్ లైన్ బెట్టింగ్ ను ఇక నుంచి ప్రమోట్ చేయనని నాని ప్రకటించడం అభినందనీయం అన్నారు.
ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సజ్జనార్.. మిగతా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు కూడా నాని లాగే సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇక నుంచైనా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ఆపాలని సూచించారు. మేం అలానే చేస్తాం.. మా ఇష్టం అనుకుంటే మీపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
Also Read:మహాశివరాత్రి … ప్రత్యేక బస్సులు
మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేం దిక్కుమాలినపనులు అని సజ్జనార్ రెండు రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే.మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో తప్పులేదు. అలా చేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తోందిఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి అని సూచించారు.

