- Advertisement -
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే జగన్ పార్టీ పరిమితమైంది. ఇప్పటికే జగన్ తన రాజీనామాను ప్రకటించగా తాజాగా రెండో రోజు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.
సజ్జలతో పాటు మరో 20 మందికి పైగా సలహాదారులు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఎన్నికల్లో ఓటమి అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే జగన్ రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత సజ్జల తన పదవికి రాజీనామా చేయడం విశేషం.
Also Read:ఎంపీగా గెలిచిన చిరు హీరోయిన్!
- Advertisement -