Sajjala:కౌంటింగ్‌ టైం..అప్రమత్తంగా ఉండండి

8
- Advertisement -

కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిగూడెంలో పార్టీ కార్యాలయంలో మాట్లాడిన సజ్జల… ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తులని విమర్శించారు.

ఎక్కడా సంయమనం కొల్పోవద్దని…ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.ఎగ్జిట్‌ పోల్స్‌లో జాతీయ సర్వేలు పొంతన లేని అంకెలు ఇచ్చాయని …లోకల్‌ సర్వేలను చూస్తే ట్రెండ్‌ ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు.

వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని…అయితే కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని…. పోస్టల్‌ బ్యాలెట్లపై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

ALso Read:రాష్ట్రాన్ని తాకిన నైరుతి..

- Advertisement -