ఫిదా క్రేజ్‌తో కాళీ వచ్చేస్తోంది..!

257
Saipallavi's Kali to dub in Telugu
Saipallavi's Kali to dub in Telugu
- Advertisement -

హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్ కంటే ఎక్కువ పేరును ఫిదాతో సంపాదించుకుంది. ప్రాంతీయ భేదాలు లేకుండా టాలీవుడ్ సాయి పల్లవిని ఒక్క సినిమాతోనే సొంతం చేసుకుంది. ఇక తెలంగాణ ప్రేక్షకులయితే సాయి పల్లవి అచ్చ తెలంగాణ యాసలో పలికిన డైలాగులకు నిజంగా ఫిదా అయిపోతున్నారు. ధియేటర్లో ఆమె తెలంగాణలో పలికిన డైలాగులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొదటి తెలుగు సినిమాతోనే ఆమె భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది.

దీంతో ఆమె మలయాళంలో చేసిన సూపర్ హిట్ చిత్రం ‘కాళీ’ ని తెలుగులోకి డబ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డివి కృష్ణ స్వామి డ‌బ్బింగ్ ఈ సినిమా రైట్స్ ద‌క్కించుకున్నాడు. 2016లో విడుదలైన ఈ చిత్రాన్ని సమీర్ తాహిర్ డైరెక్ట్ చేయగా స్టార హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాని తెలుగులో విడుద‌ల చేయ‌నున్నారు. ప్రస్తుతం నానితో చేస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ షూటింగ్ జరుగుతోంది నాగ శౌర్యతో సినిమా పూర్తైంది.

- Advertisement -