విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వైజాగ్ లో నిర్వహించిన ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. నా తొలి సినిమా నుంచీ వైజాగ్ తో అనుబంధం ఉంది. కలియుగ పాండవులు, సుందరకాండ, మల్లీశ్వరి. సీతమ్మ వాకిట్లో, గోపాలగోపాల ఇలా చాలా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ‘సైంధవ్’ చిత్రీకరణ కూడా చాలా రోజులు ఇక్కడే చేశాం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ చిత్రంగా న్యూ ఏజ్ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ‘సైంధవ్’ని తీశాం. దర్శకుడు శైలేష్ అద్భుతంగా ప్రజంట్ చేశారు. మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. మంచి సినిమా ఇవ్వాలని అందరం కష్టపడి పని చేశాం. ఇది పండగ రోజు వస్తుంది. పండగే పండగ అన్నట్టుగా ఉంటుంది. జనవరి 13న మీ ముందుకు వస్తోంది. బ్రహ్మండంగా వుంటుంది. తప్పకుండా చూడండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా మనస్పూర్తిగా థాంక్స్. ఈ సినిమాకి హీరో సారా పాపే. చాలా అద్భుతంగా నటించింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. జనవరి 13. మీరంతా రావాలి. సినిమా చూడాలి’ అని కోరారు
దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. వైజాగ్ తో నాకు చాలా మంచి అనుబంధం వుంది. HIT చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇప్పుడు ‘సైంధవ్’ కూడా ఇక్కడ చిత్రీకరణ చేశాం అద్భుతమైన నటులతో అందమైన సినిమాగా ‘సైంధవ్ తీశాం. ఇందులో చాలా మంచి డ్రామా ఉంది. వెంకటేశ్ గారిని ఎప్పుడూ చూడని రకంగా చూపించేందుకు ప్రయత్నించా. జనవరి 13న వెళ్లి అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలి. ఈ సినిమాకి ముందు కమల్‌హాసన్ గారికి అభిమానిని అని చెప్పుకునేవాడిని. ఈ సినిమా ప్రయాణం తర్వాత వెంకటేశ్ గారి కూడా అభిమానిని కూడా అయిపోయా. వెంకటేష్ గారి 75వ చిత్రం చేసే అవకాశం రావడం నా అదృష్టం. దీనికి న్యాయం చేశానని నమ్ముతున్నాను. టీం అంతా ప్రాణం పెట్టి పనిచేశాం. కాస్ట్యుమ్స్ నీరజ కోనా, ఆర్ట్ డైరెక్టర్ అవినాస్ కొల్లా, ఎడిటర్ గ్యారీ, డీవోపీ మణికందన్, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. రుహానీ శర్మ, ఆర్య, ఆండ్రియా అద్భుతమైన నటన కనబరిచారు.జనవరి 13న అందరూ థియేటర్స్ కి వెళ్లి సైంధవ్ ని ఎంజాయ్ చేయండి” అని కోరారు.
నవాజుద్దీన్ సిద్దిఖీ మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆనందంగా వుంది. వెంకటేష్ గారి, శైలేష్ కి, నిర్మాత వెంకట్ గారికి ధన్యవాదాలు. వెంకటేష్ గారిని ఇందులో డిఫరెంట్ అవతార్ లో చూస్తారు. ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తారు. దర్శకుడు ఇందులో నా పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. జనవరి 13న అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయాలి’ అని కోరారు.
Also Read:జమిలి ఎన్నికల సంగతేంటి?