రెండు ఓటీటీల్లోకి సైంధవ్..!

36
- Advertisement -

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమాను చూసిన కొందరు ట్విటర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ యాక్షన్ అదుర్స్, ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందని చెబుతున్నారు. సెకండాఫ్‌లో ఫైట్స్ మాములుగా లేవని.. ఇక ఎమోషనల్ సీన్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారని పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకి నెగిటివ్ టాక్ కూడా బాగా ఉంది. సినిమాలో మ్యాటర్ లేదు అంటూ చాలామంది పోస్ట్ లు పెడుతున్నారు.

పైగా విక్టరీ వెంకటేష్ 75వ చిత్రంగా వచ్చింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో సైంధవ్ ఓటీటీ డీల్ ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ హక్కులను రెండు ఓటీటీలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సైంధవ్ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్ కూడా దక్కించుకుందని న్యూస్ వినిపిస్తోంది. 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్. మొత్తానికి రెండు 2 ఓటీటీల్లో సైంధవ్ సినిమా రాబోతుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ డే బాగానే రాబట్టింది.

శనివారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోన్నప్పటికి.. కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ ను బట్టి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.13 కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 9 కోట్లు రాబట్టినట్టు టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రంలో వెంకటేష్ సైకో పాత్రలో కనిపించారు.

Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!

- Advertisement -