ఎన్టీఆర్ కి ‘హీరోయిన్ – విలన్’ వాళ్లే!

29
- Advertisement -

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాలతో సినిమా చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ మరియు విలన్ పాత్రలను ఫైనల్ చేశారు. హీరోయిన్ గా జాన్వీ జాపూర్ కన్ఫర్మ్ అయ్యింది. అలాగే విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఫైనల్ అయ్యాడు. ఈ వార్తల పై త్వరలోనే అధికార అనౌన్సమెంట్ రానుంది. కొరటాల శివకి మంచి దర్శకుడిగా గొప్ప పేరు ఉంది. అయితే, అంతకు మించి మంచి కథా రచయితగా కొరటాల శివకి లాంగ్ జర్నీ ఉంది. ముఖ్యంగా ఆయన రాసే బలమైన పాత్రలకు, భావోద్వేగ సన్నివేశాల్లో కొరటాల శివ రాసే లోతైన మాటలకు ఎందరో అభిమానులు ఉన్నారు.

అందుకే.. రచయితగా కూడా కొరటాల శివ సక్సెస్ అయ్యారు. ఇపుడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ను కొరటాల అద్భుతంగా డిజైన్ చేశాడట. ఈనెల 23న ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మార్చి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను కూడా సిద్ధం చేశారు. కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

మొత్తానికి కొరటాల అద్భతంగా కథను రాశాడు. ఇక ఇప్పటికే బాగా ఆలస్యం అయిన ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్‌ 5న విజయ దశమి సందర్భంగా విజయదుందుభి మోగించడానికి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ వజ్రాల దొంగ అని.. అలాగే సముద్రంలో సైనికుల్ని కాపాడే రక్షకుడిగానూ కనిపిస్తాడని.. ఒక దొంగ దేశం కోసం పోరాడే వీరుడిగా ఎలా మారాడు అనేది ఎన్టీఆర్ పాత్ర అని టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -