‘దేవర’ పై సైఫ్ అలీ ఖాన్ అలక!

19
- Advertisement -

దేవర గ్లిఫ్స్ విషయంలో సైఫ్ అలీ ఖాన్ బాగా ఫీల్ అయినట్టు తెలుస్తోంది. గ్లిఫ్స్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. నో డౌట్. కానీ తన మాటేమిటి ?, తానేమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నా ?, ఎందుకు తనకు సరైన స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు ? ఇది సైఫ్ వెర్షన్. నిజానికి సైఫ్ అలీ ఖాన్ ఏమీ మార్కెట్ లేని హీరో ఏమీ కాదు. పైగా మంచి నటుడు. ఒక జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న బాలీవుడ్ హీరో కూడా. వాస్తవానికి ఎన్టీఆర్ కి కూడా ఇప్పటివరకూ ఇన్ని అవార్డులు రాలేదు. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ ఫీల్ అవ్వడంలో అర్ధం ఉంది.

కానీ, అప్పుడే ఫీలైతే ఎట్టా.. అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అసలు, కొరటాల శివ ‘దేవర’లో సైఫ్ అలీఖాన్ కి ఎంత ఐడెంటిటీ ఇస్తారు అనే విషయంలో నిన్నమొన్నటివరకు చాలామందిలో అనుమానాలున్నాయి. ఇప్పుడు దేవర గ్లిఫ్స్ వచ్చాక ఆ అనుమానాలు మరింతగా పెరిగాయి.. ఇది సైఫ్ అలీఖాన్ అభిమానుల్లో ఉన్న ఆందోళన. దేవర మూవీలోకి సైఫ్ విలన్ గానే ఎంటర్ అయ్యారు. అయితే కొన్ని సినిమాల నుంచి కొరటాల శివ తన సినిమాల్లో విలన్ కి ప్రాధాన్యత తగ్గించేస్తున్నారు.

ఇప్పుడు సైఫ్ అలీఖాన్ విషయంలో కూడా ఏదైనా తేడా జరుగుతుందా అనుకుంటున్నారు. తీరా దేవర గ్లిఫ్స్ లో సైఫ్ అలీఖాన్ కి ఒక్క షాట్ గానీ, ఒక్క డైలాగ్ గానీ ఇవ్వలేదు. ఐతే, మరి గ్లిఫ్స్ కే ఫీలైపోతే ఎట్లా.. మొత్తం సినిమా చేసాక అప్పుడు సైఫ్ అలీఖాన్ కేరెక్టర్ విషయంలో డెసిషన్ తీసుకోవాలి కదా అంటున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా సైఫ్ అలీఖాన్ పాత్ర పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకోలేక పోతే దేవర సినిమాకే నష్టం జరుగుతుంది. కాబట్టి, కొరటాల సైఫ్ పాత్ర విషయంలో కూడా జాగ్రత్త పడితే మంచిది.

Also Read:వింటర్‌లో చిలగడదుంప తింటే ఎన్ని లాభాలో!

- Advertisement -