సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు. దాడి కేసులో నిందితుడు విజయ్ దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. థానేలో అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా నిందితుడికి ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిచ్చింది కోర్టు.
బంగ్లాదేశ్ పౌరుడైన షరీఫుల్ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి బిజయ్ దాస్ అనే పేరుతో చలామణీ అవుతున్నాడని పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. దొంగతనం చేసేందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన షరీఫుల్.. సైఫ్‌పై దాడి చేసి పరారయ్యాడని తెలిపారు.
వందలాది సీసీ కెమెరా ఫుటేజీల పరిశీలన అనంతరం దాదర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడి సంచారాన్ని గుర్తించామని, థానే సమీపంలోని ఓ కార్మిక శిబిరంలో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. సైఫ్‌పై దాడి కేసులో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఆకాశ్ కైలాశ్ కనోజియాను విచారణ అనంతరం పోలీసులు విడుదల చేశారు.
Also Read:రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: హరీశ్