సాయిధరమ్ 15…ఫస్ట్ లుక్‌!

36
saidharam
- Advertisement -

యాక్సిడెంట్ నుండి కోలుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తన 15వ సినిమాని కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తుండగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఓ ఊళ్లో వరుసగా కొంతమంది చనిపోతుండటంతో దానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలని వెళ్లిన యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఆ చావుల వెనక రహస్యం ఏమిటి?, బ్లాక్‌ మేజిక్‌, మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

తన కెరీర్ లో ఇలాంటి కథను తేజ్ చేయడం ఇదే తొలిసారి. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు తేజు.

- Advertisement -