సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రతిరోజూ పండగే. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ సంస్దలు నిర్మించాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాస్ వచ్చింది. ఈ సినిమా నైజాంలో సాయి తేజ్‌కు గుర్తించుకునే కలెక్షన్స్ రాబట్టింది. డిసెంట్ టాక్ తో మంచి కలెక్షన్లను రాబడుతుంది.
ఈమూవీ నైజాం ఏరియాలో మొదటిరోజు రూ.1.25కోట్ల షేర్ ను రాబట్టింది. సాయి తేజ్ గత చిత్రాలకు వచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే ఈసినిమాకు ఎక్కువే వచ్చాయని చెప్పుకోవాలి. ఇవాళ రేపు వీకెండ్ కావడంతో ఈమూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నిన్న విడుదలైన సినిమాలు రూలర, దొంగ మూవీలు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ప్రతిరోజూ పండగే సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మరోసారి సాయి తేజ్ కు హిట్ వచ్చిందని చెప్పుకోవాలి.