అమలా పాల్ మాజీతో సాయిపల్లవి షాదీ..?

278
Sai Pallavi marriage
- Advertisement -

మల్లు బ్యూటీ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ మూవీలో భానుమతి పాత్రలో నటించింది.. సాయి పల్లవి ఆ పాత్రలో నటించకుండా జీవించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవి మరో సూపర్ హిట్ అందుకోలేదు కానీ ఇప్పటికీ సాయి పల్లవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ మధ్య కోలీవుడ్‌లో సాయి పల్లవిపై ప్రేమ,పెళ్ళి అంటు రూమర్స్‌ చాలానే వస్తున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు ఒక దర్శకుడితో ప్రేమలో పడిందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు.. అమలా పాల్ మాజీ భర్త ఏ.ఎల్.విజయ్.

Sai pallavi

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘కణం’ సినిమా తెరకెక్కింది. తమిళ .. తెలుగు భాషల్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా ఇది మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా షూటింగు సమయంలో నుంచే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందనీ.. ఇప్పుడు బలపడిందని చెప్పుకుంటున్నారు. పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు.

అయితే సాయిపల్లవి అభిమానులు మాత్రం ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ‘అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి చెప్పిన మాటలను గుర్తుచేస్తున్నారు. ఇక ఈ వార్తలపై ఫిదా బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి..

- Advertisement -