సాయిపల్లవి షాకింగ్ రెమ్యునరేషన్!

31
- Advertisement -

ప్రేమమ్ మూవీతో యూత్‌ని అట్రాక్ట్ చేసిన భామ సాయి పల్లవి. మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ ‘ఫిదా’ చేసేసింది. ‘ఫిదా’ మూవీలో ఈ హైబ్రీడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారు లేరు అంటే అతిశయోక్తికాదు. మలయాళీ అయినప్పటికీ తెలుగు అందులోనూ తెలంగాణ యాసను నేర్చుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రామాయణంలో రణబీర్ పక్కన సీతగా నటిస్తోంది సాయిపల్లవి. ఈ సినిమాకు గాను షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఎంతో తెలుసా అక్షరాల రూ.10 కోట్లు .టాలీవుడ్‌లో సినిమాకు 3 నుండి 4 కోట్లు తీసుకుంటుండగా బాలీవుడ్‌లో దీనిని రెట్టింపు చేసిందని తెలుస్తోంది.

నితీష్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా హిట్ ద్వారా బాలీవుడ్‌లో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది సాయిపల్లవి.

Also Read:IPL 2024:అభి’షేక్’.. సేహ్వాగ్ అవుతాడా?

- Advertisement -